News January 28, 2025
దుబ్బాకలో విషాదం..!

చేసిన అప్పులు తీర్చలేక, జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోనే ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుబ్బాకలో సోమవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు.. దుబ్బాక పట్టణానికి చెందిన షేర్వానీ మహేశ్(38), కిరాణా దుకాణంలో పనిచేస్తూ, భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాల నిమిత్తం దాదాపు రెండు లక్షల వరకు అప్పు చేసి, చనిపోయాడు.
Similar News
News July 9, 2025
జనసేనలోకి చేరిన నలుగురు జడ్పీటీసీలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నలుగురు జెడ్పీటీసీలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో బుధవారం చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారందరికీ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జంగారెడ్డిగూడెం నుంచి బాబ్జీ , ఆంజనేయులు(తాడేపల్లిగూడెం), అడ్డాల జానకి(అత్తిలి), కొమ్మిశెట్టి రజనీ(పెరవలి) ఉన్నారు.
News July 9, 2025
మంగళగిరి: జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

జనసేన పార్టీలోకి ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయం అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీకాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షుడు భవనాసి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు.
News July 9, 2025
రాజమండ్రి ప్రభుత్వ సంగీత పాఠశాల ప్రిన్సిపల్‌గా శ్రీనివాస శర్మ

రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపల్‌గా పసుమర్తి శ్రీనివాస శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన కుమారి మండపాక నాగలక్ష్మి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. శ్రీనివాస శర్మ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.