News January 28, 2025

సంగారెడ్డి: భర్తను హత్య చేయించిన భార్య..!

image

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు శివారులో లభ్యమైన నారాయణ మృతదేహం మిస్టరీ వీడింది. హత్నూర పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నారాయణ భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు మరో ముగ్గురితో కలిసి హత్య చేసి పల్పనూరు శివారులో నారాయణ మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు.

Similar News

News July 7, 2025

జుక్కల్: మంత్రి వర్యా.. అలంకించండి

image

జుక్కల్ నియోజకవర్గంలో ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పిట్లం మండలం హస్నాపూర్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, కామారెడ్డి-సంగారెడ్డి అంతర్ జిల్లాల రోడ్డు నిర్మాణానికి పడిన అడుగులు ఆగిపోయాయి. నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ పనులు.. ఇలా మరెన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేస్తారో చూడాలి.

News July 7, 2025

అనంతగిరి: సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలి

image

అల్లూరి జిల్లాలో 700 మంది సీహెచ్ డబ్ల్యూలు పనిచేస్తున్నారని, వారందరినీ ఆశా కార్యకర్తలుగా మార్చాలని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు కోరారు. ఆదివారం అనంతగిరి మండలంలో పర్యటించిన డీఎంహెచ్‌వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడును ఆయన కలిశారు. సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలని విన్నవించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు.

News July 7, 2025

పోరండ్లలో నకిలీ వైద్యుడి క్లినిక్.. గుర్తించిన టీజీ ఎంసీ బృందాలు

image

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో అర్హత లేకుండా డాక్టర్‌గా చలామణి అవుతూ అనుమతి, ఏ రకమైన బోర్డు లేకుండా నిర్వహిస్తున్న అల్లోపతి క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు గుర్తించాయి. నకిలీ వైద్యుల క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోరండ్లలో రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు.