News January 28, 2025
ములుగు: ‘MLA సీతక్క’ స్టిక్కర్తో పేరుతో వాహనం కలకలం

ములుగు ఎమ్మెల్యే, సీతక్క పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని ఓ వాహనం జిల్లాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు రవి ములుగు ఎస్ఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. అయితే అదే వాహనంలో బీజేపీ కండువా సైతం ఉండటంతో ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎక్కడైనా వాహనం కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రవి కోరారు.
Similar News
News January 16, 2026
నల్గొండ: రెచ్చిపోయిన యువకులు.. కత్తులతో దాడి

మర్రిగూడ మండలం రాజపేట తండాలో సంక్రాంతి రోజు రాత్రి యువకులు రెచ్చిపోయారు. పాత కక్షల కారణంగా ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News January 16, 2026
ప్రీటెర్మ్ బర్త్కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 16, 2026
9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో 4.33% వృద్ధితో 634 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. వాణిజ్య శాఖ ప్రాథమిక డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వస్తువుల ఎగుమతులు 330 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ప్రధానంగా తృణధాన్యాలు, ఎలక్ట్రానిక్స్, జీడిపప్పు, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా అమెరికా, చైనా, UAE, స్పెయిన్, హాంకాంగ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.


