News January 28, 2025
HYDలో ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు

ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు బిగించి HYDలో అడ్డంగా దొరికిపోయారు. సోమవారం సాయంత్రం నాగోల్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. UP నుంచి HYD వస్తున్న ఓ వెహికిల్‌ను ఆపి చెక్ చేశారు. UP, AP, తెలంగాణ స్టేట్‌లకు చెందిన 3 నంబర్ ప్లేట్లు ఒకదానిపై ఒకటి ఉన్నట్లు గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేసి నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ప్రాంతానికి తరలించినట్లు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News November 5, 2025
IIM షిల్లాంగ్‌లో ఉద్యోగాలు

<
News November 5, 2025
లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల ఈ పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 5, 2025
వనపర్తి: జిల్లా వ్యాప్తంగా 1,61,314 రేషన్ సంచులు పంపిణీ

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 327 రేషన్ దుకాణాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 1,61,314 సంచులను సరఫరా చేసింది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి కాటన్ సంచులను సరఫరా చేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేసి బియ్యాన్ని తీసుకున్న వారికి మాత్రమే సంచులను సరఫరా చేయనున్నట్లు అధికారులు, రేషన్ డీలర్లు తెలియజేశారు.


