News January 28, 2025
మే 15 నుంచి 26 వరకు సరస్వతి నదీ పుష్కరాలు: మంత్రి సురేఖ

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ద్వారా రూ.25 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. సరస్వతీ నదీ పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం పనులను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
Similar News
News September 16, 2025
ఆళ్లగడ్డలో మృతదేహం లభ్యం

ఆళ్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. అభిరుచి హోటల్ వెనుక ఉన్న గని గుంతలో నీటిపై తేలియాడుతూ కనిపించింది. మృతుడి వయస్సు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నలుపు, ఎరుపు గీతలు ఉన్న ఫుల్ హ్యాండ్ చొక్కా, ఆకుపచ్చ లోయర్ ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు 9121101164 (సీఐ), 9121101203 (ఎస్సై) నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని కోరారు.
News September 16, 2025
రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ‘మిరాయ్’

తేజా సజ్జ నటించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదటి 3 రోజుల్లో రూ.81.2 కోట్లు, నిన్న రూ.10.25 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.
News September 16, 2025
మెనోపాజ్‌లో ఈ ఆహారం తీసుకుంటే మేలు!

ప్రతి మహిళకు మెనోపాజ్ దశ తప్పనిసరి. 40 ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పుల కారణంగా అనేక మార్పులొస్తాయి. అలసట, బరువు పెరగడం, హెయిర్‌లాస్ మొదలవుతాయి. కాబట్టి విటమిన్ డీ, కే, కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే ఫుడ్స్, ప్రొటీన్ కోసం చికెన్, గుడ్లు, చేపలు తినాలి. వీటితో పాటు గోధుమ, బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్, క్వినోవా, పండ్లు, ఆకుకూరలు, ఈస్ట్రోజన్ పెరగడానికి నువ్వులు, అవిసెలు, బీన్స్ డైట్లో చేర్చుకోవాలి.