News January 28, 2025
ప్రత్యేక అలంకరణలో శంబర పోలమాంబ

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ భక్తులకు ప్రత్యేక దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన జాతరలో భాగంగ సిరిమానోత్సం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలమాంబ అమ్మవారిని వనంగుడి, చదురుగుడి ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. రెండు ఆలయాలు పూలు, విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. వేకువజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Similar News
News January 9, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రానున్న CM

సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్‌కు CM చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్, MLA విజయశ్రీ ఏర్పాట్లు పరిశీలించారు. మరోవైపు వేడుకలు మూడు రోజులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు 10, 11వ తేదీల్లోనే వేడుకలకు ఏర్పాట్లు చేయగా.. తాజాగా మరో రోజు అదనంగా కొనసాగనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 9, 2026
MHBD జిల్లాలో ఉద్యోగం.. ఈనెల 12న ఇంటర్వ్యూ

మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. జిల్లాలోని చిన్నగూడూరు, కేసముద్రం, గూడూరు, సిరోలు, కురవి, గార్ల, బయ్యారం, MHBD మండల పరిధిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఏదైనా డిగ్రీ కలిగి ఉండి 20-30 సంవత్సరాలలోపు ఉన్న పురుషులు ఈనెల 12న జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News January 9, 2026
మల్యాల: బాధితుల పునరావాసానికి పూర్తి సహకారం: కలెక్టర్

మల్యాల మండలం కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లా నుంచి సమగ్ర నివేదిక సమర్పించామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బాధిత కుటుంబాలు పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిందన్నారు. ప్రభుత్వం అందించిన సహాయంతో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులు తిరిగి తమ జీవనోపాధిని ప్రారంభించాలని అన్నారు.


