News January 28, 2025

ఏలూరు: అక్కడ 10 తర్వాత షాపులు క్లోజ్

image

నేరాల కట్టడికి ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కామవరపుకోట మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న షాపులను రాత్రి 10కల్లా క్లోజ్ చేయాలని తడికలపూడి ఎస్ఐ చెన్నారావు సూచించారు. రెస్టారెంట్లు, హోటల్స్, డాబాలు, మద్యం దుకాణాలు, కిల్లి షాపులు సైతం సమయపాలన పాటించాలన్నారు. బీట్ కానిస్టేబుల్స్ తిరిగే సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా షాపులు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

Similar News

News January 17, 2026

PDPL: ‘మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం’

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో తెలంగాణ రక్షణ సమితి(D) అభ్యర్థులు పోటీ చేస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు అన్నారు. PDPLజిల్లా కేంద్రంలో శనివారం జరిగిన పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ తమకు ‘టెలిఫోన్’ గుర్తును కేటాయించిందన్నారు. భవిష్యత్తు ఎన్నికలలో పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో నిలిపి గెలిపించుకుంటామన్నారు.

News January 17, 2026

మంచిర్యాల: మేయర్, ఛైర్మన్‌ల రిజర్వేషన్లు ఖరారు

image

జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు మేయర్, ఛైర్మన్ రిజర్వేషన్లను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటించారు. మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించారు. బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను జనరల్ మహిళకు, లక్షెట్టిపేట ఎస్సీ జనరల్‌కు, చెన్నూర్ బీసీ మహిళకు ఖరారు చేశారు. ఈ ప్రకటనతో ఎన్నికల సందడి మొదలైంది.

News January 17, 2026

GWL: సర్పంచులకు శిక్షణ తరగతులు- కలెక్టర్ సంతోష్

image

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పాలన, అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎర్రవల్లి పదవ బెటాలియన్ గంగా హాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడత శిక్షణలో గద్వాల, కేటిదొడ్డి మండలాల్లోని 51 మంది సర్పంచులు శిక్షణకు హాజరు కావాలన్నారు.