News January 28, 2025

చింతూరులో మావోయిస్టు చందన మిశ్రా అరెస్ట్

image

సీపీఐ మావోయిస్టు జిల్లా కమిటీ కార్యదర్శి చందన మిశ్రా (నగేశ్)ను చింతూరులో అరెస్టు చేసినట్లు చింతూరు ఎస్సై రమేశ్ సోమవారం మీడియాకు తెలిపారు. 2018 నుంచి మావోయిస్టు పార్టీలో ఆంధ్ర – ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో క్రియాశీలకంగా ఇతను పనిచేస్తున్నాడన్నారు. చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందు పాతర పేల్చిన కేసులో నిందితుడని తెలిపారు.

Similar News

News January 14, 2026

పీఎఫ్ పెన్షనర్లకు ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్

image

EPFO పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో ఈ సేవను ఉచితంగా ఇంటి వద్దే అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్‌మ్యాన్ ఇంటి వద్దకే వచ్చి ఆధార్, ఇతర వివరాలు పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా సర్టిఫికెట్ అప్‌లోడ్ చేస్తారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్ద ఉపశమనం.

News January 14, 2026

పసిడిని మించిన ప్రసాదం.. మేడారం ‘బంగారం’

image

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంటేనే మనకు గుర్తొచ్చేది ‘బంగారం’. ఇక్కడ బంగారం అంటే పసిడి కాదు.. సాక్షాత్తు బెల్లం. రాబోయే జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మహా జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లకు సమర్పించే అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం ఇదే. భక్తులు తమ బరువును తూచుకొని తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీన్నే ‘నిలువెత్తు బంగారం’ అంటారు.

News January 14, 2026

3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

image

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి 3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 గంటలకు మధిర చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజలతో భేటీ అవుతారు. గురువారం సంక్రాంతి వేడుకల్లో పాల్గొని, శుక్రవారం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కావున అధికారులు, కార్యకర్తలు గమనించి డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ కోరారు.