News January 28, 2025
రామగుండంలో 2400 MW కొత్త ప్రాజెక్టుకు ప్రజాభిప్రాయ సేకరణ నేడు

రామగుండం NTPCలో కొత్తగా 2400 MW విద్యుత్తు ప్లాంటు నిర్మాణం కోసం నేడు<<15285274>> ప్రజాభిప్రాయ సేకరణ<<>> చేయనున్నారు. కార్పొరేషన్‌లోని కుందనపల్లి, రాణాపూర్, రామగుండం తదితర ప్రాంతాల్లోని స్థలాన్ని సేకరించనున్నారు. కొత్త విద్యుత్తు ప్రాజెక్టులో ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పలు పార్టీల నాయకులు కోరుతున్నారు. RGMలో కొత్త థర్మల్ ప్రాజెక్టుపై మీ కామెంట్?
Similar News
News March 14, 2025
వికారాబాద్: ‘పండుగ పేరుతో హద్దులు దాటొద్దు’

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు చల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తారు. అయితే కొందరు ఆకతాయిలు పండగ పేరుతో హద్దు మీరి ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి రంగులు పూయడం చేస్తారు. ఎదుటివారి ఇష్టంతో మాత్రమే రంగులు చల్లడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో దూరంగా ఉంచుతూ హుందాగా వ్యవహరించాలని, పండగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు తెలిపారు.
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!
News March 14, 2025
సంగారెడ్డి: గుండెపోటుతో యువకుడి మృతి

హత్నూర మండలం శేరుకంపల్లికి చెందిన దండు శివకుమార్(28) నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. స్థానికుల వివరాలిలా.. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న శివ.. గురువారం రాత్రి ఇంట్లో గుండెపోటుకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమార్పీఎస్ నాయకులుగా పనిచేస్తూ సమాజ సేవ చేసేవారని స్థానికులు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉండే శివ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.