News March 18, 2024

CSKvsRCB: టికెట్స్ కోసం అశ్విన్ కష్టాలు

image

ఈనెల 22వ తేదీన IPL2024 మొదలుకానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ మొదలవగా విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ప్రారంభోత్సవ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని తన పిల్లలు కోరుకుంటున్నట్లు RR ప్లేయర్ అశ్విన్ ట్వీట్ చేశారు. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్స్ దొరకలేదని, CSK సాయం చేయాలని కోరారు.

Similar News

News March 11, 2025

రేపు జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు

image

TG: ఎన్నికల కోడ్ ముగియడంతో ఎట్టకేలకు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కొత్తగా ఎంపికైన 1,286 మంది JLలకు రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. గత నెలలోనే వారికి పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనేది ఇవాళ క్లారిటీ రానుంది.

News March 11, 2025

CT విజయోత్సవం లేనట్లే!

image

భారత జట్టు గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చాక ముంబైలో విక్టరీ పరేడ్ చేసినట్లే CT గెలిచాకా నిర్వహిస్తారని అభిమానులు భావించారు. అయితే అలాంటి వేడుకలేమీ నిర్వహించట్లేదని తెలుస్తోంది. మార్చి 22 నుంచే ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఈ సమయంలో ఆటగాళ్లు విరామాన్ని కోరుకుంటున్నారు. దీంతో పరేడ్ నిర్వహించట్లేదని సమాచారం. మరోవైపు దుబాయ్ నుంచి ఆటగాళ్లు విడివిడిగా ఇళ్లకు చేరుకుంటున్నారు.

News March 11, 2025

నేడు గ్రూప్-2 ఫలితాలు

image

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.

error: Content is protected !!