News January 28, 2025

WNP: భర్తను కాల్చి చంపిన భార్య

image

వనపర్తి జిల్లాలో భర్తను భర్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూర్ (M) పిన్నంచర్ల వాసి మహేశ్(32)కు కొత్తకోట వాసి మహేశ్వరితో పెళ్లైంది. ఇటీవల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా మహేశ్ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మహేశ్ నిద్రపోతుండగా భార్య నిప్పంటించింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 29, 2025

NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>NHIDCL<<>>)లో 48 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, Sr జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News December 29, 2025

VKB: భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

image

పరిగి RTC డిపో మేనేజర్ K.కృష్ణమూర్తి అరుణాచలగిరి ప్రదర్శన భక్తులకు శుభవార్త చెప్పారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలగిరి ప్రదక్షణ, జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి 3800/- నిర్ణయించారు. జనవరి 1న బయలుదేరి 4న తిరిగి చేరుతుందని వివరించారు.

News December 29, 2025

గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీలా ఆడలేడు: పనేసర్

image

టీమ్‌ఇండియా వన్డే & టెస్ట్ కెప్టెన్ గిల్‌ చాలా బద్ధకస్తుడని, కోహ్లీలా దూకుడుగా ఆడలేడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ విమర్శించారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం అతనికి భారమని అన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే దేశవాళీ క్రికెట్ బలోపేతం కావాలని సూచించారు. ప్లేయర్లు కేవలం IPL కాంట్రాక్టుల కోసమే ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కోహ్లీ లేకపోవడంతో జట్టులో ఆ తీవ్రత కనిపించడం లేదన్నారు.