News March 18, 2024
HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.
Similar News
News April 4, 2025
HYDలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు: CP

శ్రీరామనవమి శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP స్పష్టం చేశారు.
News April 4, 2025
సికింద్రాబాద్: రైలులో బాలికకు లైంగిక వేధింపులు

సికింద్రాబాద్ రైల్వే PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూంలో అరగంట సేపు బంధించి వీడియోలు తీశాడు. లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 4, 2025
HYD: గర్ల్స్ క్యాబ్ ఎక్కుతున్నారా.. జాగ్రత్త!

HYDలో క్యాబ్, ఆటోలో ప్రయాణించే యువతులు, మహిళలకు పోలీసులు కీలక సూచన చేశారు. ‘వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేస్తే అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్ రూట్ మార్చితే వెంటనే ‘Hawk Eye’ యాప్‌లో SOS బటన్ నొక్కండి. దీంతో సన్నిహితులు, పెట్రోలింగ్ పోలీస్, సమీపంలోని PSకు రైడ్ వివరాలు వెళ్తాయి. వెంటనే మిమ్మల్ని సేవ్ చేస్తారు’ అని తెలిపారు. ఇటీవల పహాడీషరీఫ్‌లో యువతిపై కారు డ్రైవర్ అఘాయిత్యం చేశాడు. బీ కేర్ ఫుల్ గర్ల్స్!