News January 28, 2025
భీమవరం వాసికి అరుదైన అవకాశం

ప.గో జిల్లా వాసికి అరుదైన అవకాశం లభించింది. భీమవరానికి చెందిన చల్లా ధనంజయ ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా సెలక్టయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆర్డర్స్ ఇచ్చింది. 1983 నుంచి ఆయన లాయర్‌గా పనిచేస్తున్నారు. 1987 వరకు రాజమండ్రిలో వర్క్ చేసిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. 2022లో సీనియర్ లాయర్ గుర్తింపు దక్కింది. తాజా పదవి ప్రకారం ఆయన.. ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తారు.
Similar News
News March 1, 2026
ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్‌కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్‌కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.
News March 1, 2026
భీమవరం: కలెక్టర్ ఇచ్చిన ఫ్రీజర్లు.. 2 రోజులకే ధ్వంసం

గత నెలలో భీమవరం ఆస్పత్రిలో ఫ్రీజర్ మరమ్మతులకు గురై ఓ మృతదేహాన్ని రాత్రంతా అలాగే ఉంచిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించి రూ.2,60,000 నిధులతో 2 కొత్త ఫ్రీజర్లను ఆస్పత్రికి అందించారు. అయితే 2 రోజులకే దుండగులు వాటిలోని కాపర్ వైర్లను కట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలున్నాయి.
News March 1, 2026
నరసాపురం: పెద్ద మనిషిలా వచ్చి.. బాలికపై లైంగిక వేధింపులు

నరసాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలిక కుటుంబ వివాదాలను చక్కదిద్దుతామని పెద్ద మనిషిలా వచ్చి, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి రావాల్సిన నగదు విషయంలో నిందితుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆమెను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ముత్యాలరావు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.


