News January 28, 2025

KNR: పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల వివరాలు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కరీంనగర్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో నిర్వహించే క్రీడలు ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో,వాలీబాల్, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, షటిల్ బ్యాట్మెంటన్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, హాకీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా, తదితర 29 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించనున్నారు.

Similar News

News November 9, 2025

KNR: ట్రాఫిక్ చలాన్ పేరుతో సైబర్ మోసం

image

KNR జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపి, APK యాప్ డౌన్‌లోడ్ చేయించడంతో చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ ఖాతా నుంచి రూ.70,000లు, ఇతర బాధితుల నుంచి మరో రూ.1.20 లక్షల వరకు సొమ్ము మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు.

News November 8, 2025

కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

image

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్‌కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 8, 2025

KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.