News January 28, 2025

MDK: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలు.. గుమ్మడిదల(M)లో పాఠశాల బస్సు ఢీకొని సంతోష్ (7) అక్కడికక్కడే మృతి చెందగా.. హత్నూర(M)లో కామారెడ్డి జిల్లా వాసి నారాయణ(45)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గజ్వేల్‌లో బైక్ డివైడర్‌ను ఢీకొని మైలారానికి చెందిన స్వామి(26), సంగుపల్లికి చెందిన సదానందం(27) మృతి చెందారు. దుబ్బాకలో అప్పుల బాధతో శేర్వాణి మహేశ్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. 

Similar News

News March 24, 2026

హరీశ్ రాణా చనిపోయారు

image

13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ AIIMSలో ఇవాళ కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 100 శాతం కోమాలో ఉండటంతో హరీశ్ రాణాకు కారుణ్య మరణం(<<19390967>>Passive Euthanasia<<>>) కింద వైద్య సహాయాన్ని <<19352489>>నిలిపివేసేందుకు<<>> సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించింది. దేశంలో ఇలాంటి కేసు ఇదే మొదటిది. ఈ క్రమంలో హరీశ్‌కు లైఫ్ సపోర్ట్‌ను AIIMSలో ప్రత్యేక వైద్య బృందం క్రమంగా తొలగించింది.

News March 24, 2026

మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

వచ్చే నెలలో జరగనున్న బాబు జగ్జీవన్ రామ్(ఏప్రిల్ 5), డా. బి.ఆర్. అంబేడ్కర్(ఏప్రిల్ 14) జయంతి వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను జయప్రదం చేయాలని సూచించారు.

News March 24, 2026

అత్యాచార నిందితులకు జీవిత ఖైదు: ఎస్పీ

image

వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికి రాజమండ్రి కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన 21 ఏళ్ల యువతిపై, ఓడలరేవు బీచ్ ప్రాంతంలో బొమ్మిడి వీరబాబు, కోపనాతి వెంకటేశ్వర్లు, మల్లాడి తాతారావు అఘాయిత్యానికి ఒడిగట్టారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ కఠిన శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.