News January 28, 2025

సిద్దిపేట: జిల్లాలో 31,170 మందికి రైతు భరోసా జమ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 31,170 రైతులకు రైతు భరోసా నిధులు జమ అయినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక ప్రకటనలో పేర్కొన్నారు.రైతు భరోసా పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రూ.36.40 కోట్లు జమ అయినట్లు తెలిపారు.జిల్లాలోని 28 మండలల పరిధిలో ఒక్కో గ్రామం చొప్పున డబ్బులు జమ అయ్యాయని, మిగతా వారికి త్వరలోనే జమ కానున్నాయని తెలిపారు.

Similar News

News March 5, 2026

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం పేరు మార్పు

image

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావు పేరు పెట్టారు. వెంగళరావు పేరు పెట్టేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లకు మున్సిపాలిటీ ప్రజలు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దృఢమైన పునాదులు వేశారు.

News March 5, 2026

10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు Arrive-Alive కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహిస్తారని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 5, 2026

మామునూరు ఎయిర్పోర్టు.. హద్దులను పరిశీలించిన కలెక్టర్

image

మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనుల నేపథ్యంలో కొత్తగా భూసేకరణ చేసి హద్దులు నిర్ణయించిన ప్రాంతాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రాంతంలో పర్యటించారు. కొత్తగా సేకరించిన భూముల సర్వే నంబర్లు, నిర్ణయించిన హద్దులను కలెక్టర్ పరిశీలించారు. భూహద్దుల నిర్ధారణ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.