News January 28, 2025

ఓయూ: మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోండి..

image

ఓయూలో PHD కేటగిరి-2 ప్రవేశాలకు ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 11వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయవచ్చని, మార్చి చివరి వారం నుంచి 45 సబ్జెక్టుల్లో 446 సీట్లకు జరిగే PHD ఎంట్రెన్స్ టెస్ట్-2025కు అర్హత గల అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News July 6, 2025

ADB: యువతులను వేధిస్తున్న యువకుడిపై కేసు

image

యువతులు, మహిళలను వేధిస్తున్న యువకుడి పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనీస్ అనే యువకుడు స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న మహిళలు, యువతులను వేధించడంతో అతనిపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సమాచారం అందుకున్న షీటీం సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

News July 6, 2025

ADB: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు

image

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు HYDలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కొరకు
https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ADB బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు.

News July 6, 2025

సిగాచీ పరిశ్రమలో కొనసాగుతున్న సహాయక చర్యలు: కలెక్టర్

image

సిగాచీ పరిశ్రమలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది మంది ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. 34 మంది కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. 9 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందించినట్లు వివరించారు.