News January 28, 2025

NLG: ఆ భూములకు రైతు భరోసా లేనట్లే!

image

రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభమైంది. కాగా NLG జిల్లాలో తొలిరోజు 31 మండలాలకు సంబంధించిన 35,568 మంది రైతులకు రూ. 46.93 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. NLG జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి కింద సాగుకు యోగ్యంగా లేని 12,040 ఎకరాల భూములకు కూడా రైతు భరోసా చెల్లించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ భూములకు రైతు భరోసా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 8, 2025

మిర్యాలగూడ: మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈదులగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పాస్మో ప్రోగ్సి వొన్ ప్లస్ మాత్రలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

News November 8, 2025

NLG: ఉత్కంఠ భరితంగా క్రీడా పోటీలు

image

నాగార్జునసాగర్‌లో మహాత్మాజ్యోతిబా ఫులే గురుకుల విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కబడ్డీ, వాలీబాల్, ఖోఖోతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, జంపింగ్ తదితర విభాగాల పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీల్లో ఫైనల్‌కు చేరుకోగా, అథ్లెటిక్స్ విభాగంలో 200 మీటర్ల పరుగుపందెంలో నాగార్జునసాగర్ పాఠశాల ప్రథమ బహుమతి సాధించింది.

News November 8, 2025

NLG: చెరువుకు చేరుతున్న చేప.. 6 కోట్ల చేప పిల్లల పంపిణీ

image

ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లలు చేరుతున్నాయి. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో ఆరు కోట్ల చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు 60 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.