News January 28, 2025

ఉమ్మడి గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి, TGSERIS అలుగునూరు COEలలో 9వ తరగతి,TGSERIS ఖమ్మం, పరిగి SOE లలో 8వ తరగతి,TGSERIS రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్స్ ఆర్ట్స్ స్కూల్‌లలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తెలిపారు.

Similar News

News January 29, 2026

రంగారెడ్డి: ‘90001 13667కు సమాచారమివ్వండి’

image

అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 90001 13667కు ఫోను చేసి సమాచారమివ్వాలని హైడ్రా కమిషనర్ నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్నా లొకేషన్‌తో పాటు వీడియోలు, ఫొటోలు పంపించాలన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలను తగ్గించడమే కావాలని కోరారు.

News January 29, 2026

శెట్టూరు: వేరుశనగకు రికార్డు ధర

image

చెళ్లకెర వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ పంటకు రికార్డు స్థాయి ధర లభించింది. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన రైతులు నాగభూషణ గౌడ, మంజన్న, పెన్నప్ప పండించిన వేరుశనగ క్వింటా ధర రూ.12,810 పలికింది. నాణ్యమైన దిగుబడి సాధించినందుకు మార్కెట్ యార్డ్ యజమానులు రంగస్వామి, ఈరన్న రైతులను సన్మానించారు. ఈ ధర ఇతర రైతుల్లో ఆనందాన్ని నింపింది.

News January 29, 2026

ఏకాదశి రోజున ఏం చేయాలంటే..?

image

5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో పాటు మన మనసును అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును పూజించాలి. లక్ష్మీదేవిని కొలుస్తే సిరి సంపదలు సొంతమవుతాయని నమ్మకం. కుదిరితే జాగారణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. శక్తి కొలది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా తులసి దళాలతో స్వామిని పూజించడం, నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభకరం.