News January 28, 2025
అమెరికన్లకు ట్రంప్ సంచలన ఆఫర్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలకు సంచలన ఆఫర్ ప్రకటించారు. వారికి ఆదాయపు పన్నును తొలగించేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్లు రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆ నిర్ణయం వల్ల తగ్గే ఆదాయాన్ని ఇతర దేశాలపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా సమకూర్చుకుంటామని పేర్కొన్నారు. అమెరికన్లను మరింత శక్తిమంతులుగా, సంపన్నులుగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News July 9, 2025
ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
News July 9, 2025
మార్కెట్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్లైన్లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.