News January 28, 2025

మందమర్రిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

మందమర్రిలోని రైల్వే వంతెన కింద మంగళవారం రైలు ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 – 45 సంవత్సరాలు ఉంటుందని, ఛాతీపై రెండు పాత గాయం మచ్చలు ఉన్నాయని మంచిర్యాల జీఆర్పీ ఎస్ఐ మహేందర్ తెలిపారు. కాగా ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8328512176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News July 5, 2025

కాసేపట్లో వర్షం: వాతావరణ కేంద్రం

image

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News July 5, 2025

HYD: స్వల్పంగా పెరిగిన డెంగీ కేసులు: మంత్రి

image

హైదరాబాద్‌లో డెంగీ కేసులు స్వల్పంగా పెరిగాయని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. యాంటిలార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని, ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని
మంత్రి సూచించారు.

News July 5, 2025

సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార సంస్థలు సమ్మిళితమై స్థిరమైన అభివృద్ధి మార్గాలతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, సహకార సంఘాల పతాకాన్ని ఎగురవేశారు.