News March 18, 2024
CSK ప్లేయర్‌కు అస్వస్థత

నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుండగా CSKకు మరో షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శరీరమంతా తిమ్మిర్లు రావడంతో మైదానంలో నిలబడలేకపోయారు. దీంతో వెంటనే వైద్య సిబ్బంది స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. CSK మరో పేసర్ పతిరణ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. తొలి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది.
Similar News
News April 11, 2025
టీవీల్లోకి బ్లాక్ బస్టర్ సినిమా

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈనెల 13, 14 తేదీల్లో దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది. ఈనెల 13న తెలుగులో స్టార్ మా (5.30pm), మలయాళంలో ఆసియా నెట్ (6.30pm), కన్నడలో కలర్స్ కన్నడ (7pm), 14న తమిళంలో స్టార్ విజయ్ (3pm) టీవీ ఛానల్‌లో రానుంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.
News April 11, 2025
జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్‌షా

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.