News January 28, 2025

BREAKING: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట

image

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్ బాలయ్య తరఫు న్యాయవాది మణీంద్రసింగ్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసును వాదించడానికి ఎలా వచ్చారంటూ ప్రశ్నించింది.

Similar News

News October 19, 2025

పండ్ల తోటలు: కొమ్మల కత్తిరింపులో జాగ్రత్తలు

image

పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల సూర్యరశ్మి లోపలి భాగాలకూ చేరి ఎదుగుదల బాగుంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తిరింపు పరికరాలను సోడియం హైపో/బ్లీచింగ్ పౌడర్ ద్రావణంలో ముంచిన తర్వాతే వాడుకోవాలి. లేదంటే ఏవైనా వ్యాధులు ఇతర చెట్లకు వ్యాపిస్తాయి. కత్తిరింపులు పూర్తయ్యాక చెట్ల భాగాలకు బ్లైటాక్స్ పేస్ట్/కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్‌తో పూత వేయాలి. అధిక వర్షాలున్నప్పుడు కత్తిరింపులు చేయరాదు.

News October 19, 2025

ఐఐటీ ధన్‌బాద్‌లో ఉద్యోగాలు

image

IIT ధన్‌బాద్ 10 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ సూపరింటెండెంట్(లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్( లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్ (మెడికల్) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.Lib.Sc/MLISc, పీజీ, B.Lib.Sc, BLISc,పీజీ డిప్లొమా, ఫార్మసీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.iitism.ac.in/

News October 19, 2025

21న ‘మూరత్ ట్రేడింగ్’.. ఈ ఏడాది మారిన టైమింగ్

image

దీపావళి సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు BSE, NSE ప్రకటించాయి. ప్రతిఏటా సాయంత్రం పూట ఈ సెషన్ జరిగేది. అయితే ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. లక్ష్మీ పూజను పురస్కరించుకొని గంటపాటు జరిగే ఈ ట్రేడింగ్‌లో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. కాగా 21, 22 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు.