News January 28, 2025
పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

AP: మాజీ మంత్రి పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పేర్ని జయసుధకు చెందిన గోదాంలో రేషన్ బియ్యం బస్తాల మాయం ఘటనలో తనను పోలీసులు A6గా చేర్చారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పేర్ని నాని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
Similar News
News January 25, 2026
రేపు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు: కలెక్టర్

ఈనెల 26న (సోమవారం) కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఆ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.
News January 25, 2026
ఆదివారం రోజున మాంసాహారం తింటున్నారా?

ఆదివారమొస్తే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాలు అది తప్పని చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సూర్యుడికి అంకితమైన రోజు. ఆయన ఆరోగ్యానికి, సాత్విక శక్తికి కారకుడు. ‘స్త్రీ తైల మధు మాంసాని రవివారే విసర్జయేత్’ అనే శ్లోకం ప్రకారం ఈరోజు మాంసం తినకూడదు. ఇది మన శరీరంలో తామస గుణాన్ని పెంచుతుంది. సూర్యుని సాత్విక శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆత్మశుద్ధి, దీర్ఘాయువు కోసం ఈ నియమాలు పాటించాలి.
News January 25, 2026
2028లో స్పేస్ స్టేషన్ పనులు ప్రారంభం: ISRO

ఇండియన్ స్పేస్ స్టేషన్ పనులు 2028లో ప్రారంభమవుతాయని ISRO ఛైర్మన్ డా.వి.నారాయణన్ వెల్లడించారు. 2035 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఇటీవల ఫెయిలైన PSLV-C62 మిషన్ ప్రభావం ‘గగన్‌యాన్’ (మానవ సహిత అంతరిక్ష యాత్ర) ప్రాజెక్టుపై ఉండదని స్పష్టం చేశారు. చంద్రుని సౌత్ పోల్‌పై స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఘనత మనదేనని గుర్తుచేశారు. కాగా గగన్‌యాన్ మిషన్‌ను 2026 చివర్లో/2027లో ప్రయోగించే అవకాశముంది.


