News January 28, 2025
పెళ్లిపీటలెక్కనున్న ‘ఆరెంజ్’ హీరోయిన్

ఆరెంజ్, మసాలా సినిమాల్లో నటించిన షాజమ్ పదమ్‌సీ పెళ్లిపీటలెక్కనున్నారు. ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో ఆమె రోకా ఈవెంట్ తాజాగా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆశిష్, తాను రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఈ ఏడాది జూన్‌లో పెళ్లి పీటలెక్కనున్నామని స్పష్టం చేశారు. ఆరెంజ్‌లో రూబా పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
Similar News
News January 28, 2026
12న దేశవ్యాప్త సమ్మె.. పెరుగుతున్న మద్దతు

కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో FEB 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. తాము కూడా సమ్మెలో పాల్గొంటామని APలోని అంగన్వాడీ యూనియన్లు తెలిపాయి. TGలోని ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మె నోటీసులు అందజేశాయి. కొత్త చట్టాల వల్ల ఇబ్బందులు వస్తాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 28, 2026
డాలర్ డౌన్.. ఆకాశానికి చేరిన చమురు ధరలు

US డాలర్ భారీగా బలహీనపడి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. మరోవైపు ఇరాన్‌తో పెరుగుతున్న <<18971432>>ఉద్రిక్తతల<<>> నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు 4 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులకు ఆదేశాలు ఇవ్వొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో పరిణామాలు చమురు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
News January 28, 2026
కేరళ బస్సు వివాదం.. షింజితా ముస్తఫా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

కేరళలోని ఓ బస్సులో దీపక్ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేసి అతని <<18917671>>ఆత్మహత్యకు<<>> కారణమైన షింజితా ముస్తఫాకు కోజికోడ్ కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను అప్‌లోడ్ చేసిన ఫోన్‌ను సైంటిఫిక్ అనాలసిస్‌కు పంపామన్నారు. ఈ దశలో ఆమెను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.


