News January 28, 2025
వికారాబాద్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నాం: సీఎం

వికారాబాద్ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉందని వికారాబాద్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టెంపుల్, ఎకో టూరిజంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయన్నారు. రామప్ప, వేయి స్తంభాల గుడి లాంటి ప్రపంచ ప్రఖ్యాత మందిరాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజం వెనకబడుతోందని టూరిజం పాలసీ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
Similar News
News November 5, 2025
GWL: దాసరి బీసన్న పోరాటానికి ఫలితం

ఎర్రవల్లి కి చెందిన దాసరి బీసన్న గ్రామాల్లో తిరుగుతూ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించాడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు గద్వాల మహేంద్ర షో రూమ్‌లో ఓ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆ వాహనం కొద్ది రోజులకే మొరాయించింది. వాహనాన్ని మార్చాలని షోరూమ్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేశాడు. వారికి ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఎట్టకేలకు మంగళవారం షోరూం నిర్వాహకులు అతడికి కొత్త వాహనాన్ని అందజేశారు.
News November 5, 2025
జగన్‌లో నానాటికి పైశాచికత్వం పెరుగుతుంది: ప్రత్తిపాటి

జగన్ రైతుల నమ్మకానికి అనర్హుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. చిలకలూరిపేటలో మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. రైతులు, వ్యవసాయం గురించి జగన్ మాట్లాడుతుంటే నాగలి నవ్వుతుందని, నేలతల్లి బోరు మంటుందన్నారు. చంద్రబాబు నాయకత్వం పటిమతో ఏపీకి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలతో జగన్‌లో నానాటికి పైశాచికత్వం పెరుగుతుందన్నారు.
News November 5, 2025
కార్తీక పౌర్ణమికి నదీ స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్త: ఎస్పీ

కార్తీక పౌర్ణమికి నది స్నానాలకు వెళ్లే జిల్లాలోని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం కోరారు. నదీ స్నానాలు, దేవాలయాల సందర్శ నల విషయంలో భక్తులు తప్పక పాటించాల్సిన కీలక సూచనలను ఎస్పీ విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహం ఉద్ధృతంగా ఉందని, లోతు లేని సురక్షిత ప్రాంతంలోనే స్నానం చేయాలన్నారు. సుడులు తిరిగే ప్రాంతాలకు వెళ్లకుండా దీపాలు నీటిలో వదలాలని సూచించారు.


