News January 28, 2025

మరికల్: వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష

image

మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయిని కొట్టి వేధించిన కేసులో కన్మనూరుకి చెందిన చింటూ అనే యువకుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20,200 జరిమానా విధిస్తూ జడ్జి వింధ్య నాయక్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2017 సెప్టెంబర్ 13న అమ్మాయి తండ్రి తిమ్మప్ప ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడంతో జైలు శిక్ష విధించిందని చెప్పారు.

Similar News

News January 16, 2026

‘కోస’ కోడికి భారీ డిమాండ్.. పందెంలో ఓడినా.. ధరలో మొనగాడే!

image

కోడిపందేల బరిలో చనిపోయిన కోడి(కోస)కు ప్రస్తుతం ఊహించని డిమాండ్ ఏర్పడింది. పందెం కోసం చికెన్, మటన్, డ్రై ఫ్రూట్స్‌తో రాజభోగం అనుభవించిన ఈ కోడి మాంసం రుచిగా ఉంటుందనే నమ్మకంతో జనం ఎగబడుతున్నారు. పందెంలో ఓడి ప్రాణాలు విడిచినప్పటికీ, ఒక్కో కోడి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతోంది. చనిపోయిన కోడికి ఈ స్థాయిలో రేటు ఉండటం చూసి సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

News January 16, 2026

KNR: ఎన్నికల నగారా.. టికెట్ వేటలో ఆశావహులు

image

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో రాజకీయ సందడి మొదలైంది. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో టికెట్ ఆశావహుల తాకిడి పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తమ గళాన్ని వినిపిస్తూ, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

News January 16, 2026

విశాఖలో భూ లిటిగేషన్‌లతో తలపోటు (1/2)

image

విశాఖలో భూ లిటిగేషన్లు మరోసారి తలపోటుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమార్కులు తిష్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వివాదాలు తెరపైకి రావడం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో యాజమాన్య హక్కులపై సవాళ్లు పెరుగుతున్నాయి.