News March 18, 2024

పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు..!

image

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఖరారు అయినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో డిప్యూటీ CM సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరిలో ప్రసాద్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Similar News

News April 1, 2026

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

image

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము వరకు మెరుపు దాడులు నిర్వహించారు. ఇంటి పన్నులు, భవన క్రమబద్ధీకరణలో భారీగా లంచాలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. ఉద్యోగుల ఫోన్ పే లావాదేవీలను పరిశీలించి, ఫోన్లను సీజ్ చేశారు. రూ.12 కోట్ల నిధులు రూ.12 లక్షలకు తగ్గడంపై కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు, పలువురు సిబ్బందికి విచారణ నోటీసులు జారీ చేశారు.

News April 1, 2026

ఖమ్మం: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

News April 1, 2026

KMM: నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ

image

రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 748 దుకాణాల పరిధిలో 4,69,865 కార్డుదారులు ఉండగా, 13,28,400 మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కేజీల చొప్పున, మూడు నెలలకు గాను 2,54,71,860 కేజీల బియ్యం అవసరమని అధికారులు తెలిపారు.