News January 28, 2025

కామారెడ్డి : ఢిల్లీలో తెలంగాణ కళారూపాలు

image

తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం ఢిల్లీ వాసులను మంత్రముగ్ధులను చేశాయి. మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో TGకు చెందిన కళాకారులు ‘భారత్‌ పర్వ్‌-2025’లో భాగంగా పేరిణి నాట్యాన్ని ప్రదర్శించారు.TG ప్రఖ్యాత కళాకారులు పేరిణి ప్రకాశ్‌ నేతృత్వంలో TG సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దీపిక పేరిణి బృందంలో పాల్గొనడం జిల్లాకు గర్వకారణమని కామారెడ్డి కళాకారులు అన్నారు.

Similar News

News November 8, 2025

HYD జలమండలికి అవార్డుల పరంపర..!

image

ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డ్‌లను గెలుచుకున్న HYD జలమండలి, మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో ఆర్‌టీఐ కేసులను సమర్థవంతంగా పరిష్కరించినందుకు తెలంగాణ సమాచారం కమిషన్ ‘ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్’ పురస్కారాన్ని ప్రకటించింది. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డును సైతం కైవసం చేసుకుంది.

News November 8, 2025

జగిత్యాల: ‘ర్యాలీని విజయవంతం చేయాలి’

image

తమ సమస్యల పరిష్కారం కోసం ముంబాయిలో ఈ నెల 17న నిర్వహిస్తున్న రిప్రెజెంటేటివ్స్ ర్యాలీని విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని కోరారు. నాయకులు రాము, సునీల్, అరవింద్ పాల్గొన్నారు.

News November 8, 2025

ముగిసిన జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నామినేషన్ ప్రక్రియ

image

జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 2025-27 కార్యవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగిసినట్లు జిల్లా అడహక్ కమిటీ సభ్యుల వెల్లడించారు. మెయిన్ బాడీ 7 పదవులకు 9 నామినేషన్లు, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లకు 18 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. ఈరోజు 2 పదవులకు విత్ డ్రా చేసుకున్నారని, ఈనెల 15న ఎన్నికలు నిర్వహిస్తామని, పాస్టర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.