News January 28, 2025
మార్కెట్ లాభాలకు కారణం ఇదే!
చైనా Deepseek AI వల్ల IT స్టాక్స్, ఎయిడ్స్ మందుల సరఫరాకు ఇచ్చే నిధులను నిలిపేస్తామన్న US ప్రకటనతో ఫార్మా రంగాలు నష్టపోయినా దేశీయ స్టాక్ మార్కెట్లు Tue లాభాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంపు నిర్ణయాలతో రెపో రేటును RBI తగ్గించవచ్చన్న ఉహాగానాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీంతో బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో వోలటైల్ మార్కెట్లోనూ సూచీలు లాభపడ్డాయి.
Similar News
News January 30, 2025
లిప్‌స్టిక్, ఫేస్‌క్రీమ్ కొంటున్నారా?
లిప్‌స్టిక్, ఫేస్‌క్రీమ్ వంటి కాస్మొటిక్స్‌లో అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్నట్లు, అవి వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని కేరళ ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తులపై మెర్క్యూరియస్ క్లోరైడ్, మెర్క్యూరీ, మెర్క్యూరిక్, మెర్క్యూరియో, కలోమెల్ రాసి ఉంటేనే కొనాలి. ఇలా ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో రాసిలేకపోతే కొనొద్దు. మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల వణుకు, డిప్రెషన్, వినికిడి లోపం సమస్యలొచ్చే ఆస్కారముంది.
News January 30, 2025
భూమి కిందే వీళ్ల ఇళ్లు!
ఆఫ్రికా ఖండం సౌత్ ట్యునీషియాలోని మత్మత గ్రామం ఓ పర్యాటక ప్రాంతం. 1969లో వచ్చిన వరదలతో ఇక్కడ భూమి కింద ఇళ్లు ఉన్నట్లు బాహ్య ప్రపంచానికి తెలిసింది. అక్కడి ప్రజలను వేరే చోటుకు తరలించినా మళ్లీ అక్కడికే చేరుకుంటారు. ఇది తమకు సురక్షిత ప్రాంతమని.. చలి, వేడి నుంచి ఇళ్లు రక్షిస్తాయని చెబుతారు. ఇక్కడ విద్యుత్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్టార్ వార్తో సహా చాలా హాలీవుడ్ చిత్రాలను ఇక్కడ చిత్రీకరించారు.
News January 30, 2025
సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నా: DGP
AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని DGP ద్వారకా తిరుమలరావు అన్నారు. తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నట్లు చెప్పారు. 7 నెలలుగా DGPగా పని చేస్తున్నానని, 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించానని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై 9.5% నేరాలు తగ్గినట్లు వివరించారు. సైబర్ క్రైమ్స్ తప్ప మిగతావన్నీ కంట్రోల్లోనే ఉన్నాయన్నారు. రేపు ఆయన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.