News January 28, 2025
జనగామ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

జనగామ జిల్లా దేవరుప్పుల కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. ఏ తరగతి చదువుతున్నారు? ఏ ఊరు? ఉదయం అల్పాహారం ఎలా ఉంటుంది? సంధ్యా సమయంలో తినే స్నాక్స్ ఏమైనా ఇస్తున్నారా? వంటి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 2, 2026
ప.గో జిల్లాలో కిడ్నాప్ కలకలం

ఆకివీడు మండలంలోని తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఆగంతకులు స్ప్రే చల్లి ఎత్తుకెళ్లినట్లు స్థానిక దివ్యాంగురాలు రుక్మిణి కుమారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
News January 2, 2026
AP, TG మధ్య ఉన్న జలవివాదాలు ఏంటి?

AP, TG జల <<18742119>>వివాదాలు<<>> దశాబ్దాలుగా ఉన్నాయి. TG విద్యుదుత్పత్తితో శ్రీశైలంలో తమ నీటి వాటా తగ్గుతోందని AP వాదిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి AP ఎక్కువ నీటిని తీసుకుంటోందనేది TG అభ్యంతరం. KWDT-I అవార్డు ప్రకారం AP, TG వాటా 66:34 నిష్పత్తి కాగా తెలంగాణ 50% ఇవ్వాలంటోంది. పాలమూరును AP వ్యతిరేకిస్తోంది. పోలవరం-బనకచర్లకు TG ససేమిరా అంటుండగా గోదావరి మిగులు నీటిపై హక్కు తమదేనని AP వాదిస్తోంది. ఇలా అనేకమున్నాయి.
News January 2, 2026
గ్రోక్ ‘బికినీ’ ట్రెండ్.. మహిళా ఎంపీ ఆందోళన

ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ అసభ్యకర ట్రెండింగ్‌పై శివసేన(UBT) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ ఐటీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. మహిళల ఫొటోలను గ్రోక్ ద్వారా అశ్లీలంగా మార్ఫ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. కాగా ‘X’ సీఈవో మస్క్ కూడా ‘బికినీ’ ట్రెండ్‌ను వైరల్ చేస్తుండటం గమనార్హం.


