News January 28, 2025

హెల్మెట్ ధరించే వాహనం నడపాలి: ఎంపీ హరీష్ మాధుర్

image

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో భట్లపాలెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన మోటార్ వాహనాల అవగాహన సదస్సులో ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతివిద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాలు నడపాలన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా వాహనం తీయకూడదని వివరించారు. సోషల్ మీడియాలో ఎంత అవగాహనతో ఉంటున్నారో రహదారి భద్రత పట్ల అంతే బాధ్యతగా ఉండాలన్నారు.

Similar News

News December 13, 2025

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ రోహిత్ రాజు

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, పంచాయతీల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

News December 13, 2025

మోగ్లీ మూవీ రివ్యూ&రేటింగ్

image

ప్రేమించిన యువతి కోసం క్రిమినల్ పోలీ‌స్‌తో హీరో చేసే పోరాటమే మూవీ కథ. రోషన్ యాక్టింగ్, బధిర యువతిగా హీరోయిన్, బండి సరోజ్ నటన మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ ఫర్వాలేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ లవ్‌స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. కర్మ సిద్ధాంతంతో లింక్ పెట్టి సందీప్ రాజ్ కథ అల్లారు.
రేటింగ్:2.25/5

News December 13, 2025

కశింకోట: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య.. యాక్సిడెంట్‌గా చిత్రీకరణ

image

కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. K.నారాయణమూర్తి (54)ని అతని బంధువులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించారు. మృతుడి పేరుమీద ప్రధాన నిందితుడు ఎస్.అన్నవరం రూ.కోటి వరకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ నేరంలో మరో ఇద్దరితో పాటు LIC ఏజెంట్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.