News March 18, 2024

మల్కాజిగిరిలో పాగా వేసేదెవరో?

image

గత MP ఎన్నికల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు 6,03,748 ఓట్లు రాగా BRS అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి 5,92,829 ఓట్లు, BJP అభ్యర్థి రాంచందర్‌రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. BRS తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించగా BJP నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.

Similar News

News July 3, 2024

HYD: వీరిలో ఒకరికి మంత్రి పదవి?

image

ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో మంత్రి పదవి కోసం RR జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి, HYD నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని ఇటీవల సీఎం చెప్పడంతో దానం ఆశలు సన్నగిల్లాయి. కాగా గతంలో దానంకు రేవంత్ రెడ్డి మాట ఇవ్వడంతో ఆశతో ఉన్నారు.

News July 3, 2024

గోల్కొండ దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్

image

చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ 14 మంది సభ్యులతో కూడిన బోనాల ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులను జారీ చేశారు. సభ్యులందరూ అరవింద్ మహేశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనాల ఉత్సవాల కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.

News July 3, 2024

HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

image

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.