News January 28, 2025

కామారెడ్డి: DLSA కార్యదర్శిని కలిసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారి

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి ప్రమీల DLSA కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై, న్యాయపరమైన అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో DLSA, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

image

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పలు రికార్డులను, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్‌మెంట్ మొదలగు అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించాలని ఎస్సైని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట పటిష్టమైన నిఘా ఉంచి భద్రత పర్యవేక్షించాలన్నారు.

News November 13, 2025

రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన: CM

image

రాష్ట్రంలో రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుందని CMచంద్రబాబు రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చించారు. సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని CM వెల్లడించారు.

News November 13, 2025

VJA: 4 రోజులుగా CT స్కాన్ సేవలు బంద్.. రోగుల అవస్థలు.!

image

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో గత నాలుగు రోజులుగా సీటీ స్కాన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేట్, ప్రభుత్వ సీటీ స్కాన్ పరికరాలు ఒకేసారి పాడైపోవడమే దీనికి కారణం. రోజుకు 200 నుంచి 300 వరకు స్కాన్లు జరిగేవి. ప్రస్తుతం రోగులను అంబులెన్స్‌లో బయట కేంద్రాలకు తరలించి స్కాన్లు చేయిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.