News March 18, 2024
మల్కాజిగిరిలో పాగా వేసేదెవరో?

గత MP ఎన్నికల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు 6,03,748 ఓట్లు రాగా BRS అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి 5,92,829 ఓట్లు, BJP అభ్యర్థి రాంచందర్రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. BRS తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించగా BJP నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.
Similar News
News September 5, 2025
HYD: నేడు, రేపు WINES బంద్

రేపు గణపతి నిమజ్జనాల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్& రెస్టారెంట్లు ఇవాళ సా.6 నుంచి రేపు సా.6 గంటల వరకు మూసేయాలని CP సుధీర్ బాబు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వైన్సు, బార్లు, కల్లుకాంపౌండ్లు బార్& రెస్టారెంట్లు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం ఉ.6 గం.కు బంద్ చేయాలని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
News September 5, 2025
ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండమే: ఆర్.కృష్ణయ్య

తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.
News September 5, 2025
పెరిగిన బిజినెస్.. GHMCకి భారీ ఆదాయం

మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇళ్లు, స్థలాలు ఈ సంవత్సరం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ అనుమతుల ద్వారా GHMCకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు GHMCకి రూ.399 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అవే నెలలకు సంబంధించి రూ.759.98 కోట్లు వచ్చింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.