News January 28, 2025

రాష్ట్రంలో దారుణం

image

TG: హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లో దారుణం జరిగింది. భరత్ అనే యువకుడిపై ఓ యువతి(17) తండ్రి దాడి చేసి గొంతు కోశాడు. యువకుడు ఆ యువతితో కలిసి ఇంట్లో ఉండగా చూసిన ఆమె తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని అవమానంగా భావించిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో యువతిని కలిసేందుకు భరత్ వెళ్లినట్లు సమాచారం.

Similar News

News November 8, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

➤ WWC విజయం: రిచా ఘోష్‌ను డీఎస్పీగా నియమించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం
➤ AUSvsIND టీ20 సిరీస్‌: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అభిషేక్ శర్మ
➤ వరుసగా 12వ టీ20 సిరీస్ గెలిచిన టీమ్ఇండియా
➤ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ
➤ IPL: నవంబర్ 15న తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించనున్న జట్లు.. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో LIVE చూడొచ్చు.

News November 8, 2025

మురికి కాలువల పక్కన కొత్త ఇల్లు కట్టొచ్చా?

image

మురికి కాలువల సమీపంలో ఇల్లు కట్టుకోవడం ఆరోగ్యానికి హానికరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. మురికి కాలువల వల్ల అపరిశుభ్రత, కాలుష్యం పెరిగి, దుర్గంధం కారణంగా తరచుగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని ఆయన సూచన. ‘నివాస స్థలంలో శుభ్రత, స్వచ్ఛత లేకపోతే అక్కడ సానుకూల శక్తి నిలవదు. అందుకే శుభ్రత, ప్రశాంతత ఉండే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి’ అని వాస్తు శాస్త్రం చెబుతోంది. <<-se>>#Vasthu<<>>

News November 8, 2025

చైతూ-సామ్ విడాకులకు రాజ్‌తో రిలేషనే కారణమా?

image

సమంత, డైరెక్టర్ రాజ్ క్లోజ్‌గా ఉన్న <<18231711>>ఫొటో వైరల్<<>> అవడంతో నాగచైతన్యతో ఆమె విడిపోవడానికి ఈ రిలేషనే కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చైతూతో విడిపోకముందు రాజ్ డైరెక్ట్ చేసిన ‘ఫ్యామిలీ మాన్-2’ సిరీస్‌లో సమంత నటించారు. అయితే ఆ సమయంలోనే రాజ్, సామ్ మధ్య రిలేషన్ ఏర్పడి ఉండొచ్చని, అదే చైతూ-సామ్ విడాకులకు కారణమని పలువురు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు సామ్‌కు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.