News March 18, 2024

పెళ్లిలో డాన్స్ చేస్తూ.. గుండెపోటుతో మృతి

image

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా కొలనూరులో ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ చేస్తూ రావుల విజయ్ కుమార్(33) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది.

Similar News

News January 6, 2025

HMPV.. కరోనా వైరస్‌లా ప్రమాదకరమా?

image

HMPV వైరస్ కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని HYD అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. ఇది కరోనా లాంటిది కాదని, మహమ్మారి అయ్యే అవకాశాలు లేవంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో HMPV సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన 4-7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు.

News January 6, 2025

పుష్పకేమో నీతులు.. గేమ్ ఛేంజర్‌కు పాటించరా!: అంబటి

image

AP: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ మరణించిన అభిమానులకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరిహారం ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘పుష్పకేమో నీతులు చెప్తారా.. ‘గేమ్ ఛేంజర్’‌కి పాటించరా!’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

News January 6, 2025

HMPV ఎఫెక్ట్: హాస్పిటల్స్ షేర్లకు లాభాలు

image

దేశంలో <<15078134>>కొత్త వైరస్<<>> కేసులతో మదుపర్లు భయాందోళనలకు గురవడంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రుల షేర్లు మాత్రం లాభాల్లో పరిగెడుతున్నాయి. అపోలో, రెయిన్‌బో, KIMS, ఆస్టర్, నారాయణ హృదయాలయ తదితర హాస్పిటళ్ల షేర్లు 2-4% లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తి చెంది ఆస్పత్రులకు తాకిడి పెరుగుతుందనే ఊహాగానాలే దీనికి కారణాలుగా మార్కెట్ వర్గాలు అంటున్నాయి.