News January 28, 2025
గొంగడి త్రిష సెంచరీ.. మంత్రి రాజనర్సింహ అభినందనలు

ఉమెన్స్ U-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని, అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించాలని అనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు త్రిష ప్రదర్శన స్పూర్తిగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.
Similar News
News November 9, 2025
జూబ్లీ బైపోల్: ఓటర్లు, పోలింగ్ బూత్‌ల వివరాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య: 4,01,365. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద రెండంచల భద్రత ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నికలో 58 అభ్యర్థులు(+నోటా) పోటీ చేస్తున్నారు. INC-BRS-BJP మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.

రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన ఉమ్మడి ADB జట్టు

నారాయణపేట జిల్లాలో ఈనెల 7 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి SGF అండర్-17 హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు ఫైనల్స్‌కు చేరింది. వివిధ జిల్లా జట్టులతో తలపడి ప్రతిభ కనబరిచింది. నేడు జరిగే ఫైనల్స్‌కు చేరిందని ఆదిలాబాద్SGF సెక్రెటరీ తెలిపారు. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ అభినందించారు.