News January 28, 2025
సిద్దిపేట: ఇంటర్మీడియట్ పరీక్షలపై సమీక్ష

సిద్దిపేట జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలపై సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్‌లో ఇంటర్ పరీక్షల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇంటర్మీడియట్ విధ్యాధికారి రవీందర్ రెడ్డి, విద్య, విద్యుత్, తపాలా, పోలీస్, వైద్య, ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు, ఇంటర్ జనరల్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News December 31, 2025
‘ధురంధర్’పై బ్యాన్.. రూ.90 కోట్లు లాస్: డిస్ట్రిబ్యూటర్

రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు(రూ.1100+కోట్లు) రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో రూ.90 కోట్లు లాస్ అయ్యామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు మూవీని బ్యాన్ చేయడమే కారణమని పేర్కొన్నారు. PAKకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ సినిమాను ఆ దేశాలు నిషేధించాయి.
News December 31, 2025
నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్

నారాయణపేట జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ నియమించిన నారాయణ్ అమిత్ మాలెంపాటి నియామకాన్ని రద్దు చేస్తూ, ఉమాశంకర్ ప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
News December 31, 2025
TTDకి కోటి రూపాయల విరాళం

TTD ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు విజ్ఞాన్స్ విద్యాసంస్థలు రూ.కోటి విరాళంగా ప్రకటించాయి.ఆ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలసి విరాళ డీడీని అందజేశారు. విద్యా రంగానికి విశేష సేవలందిస్తున్న విజ్ఞాన్స్ సంస్థల తరపున ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందజేయడం అభినందనీయమని ఛైర్మన్ పేర్కొన్నారు.


