News January 28, 2025
యాడికి: చిరుతల ఆచూకీకై గాలింపు

యాడికి మండలం సాగర్ సిమెంట్ ఏరియా, పంట పొలాల్లో గత 2రోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయని గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుత్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నారపరెడ్డి, బీట్ ఆఫీసర్ మాధవి, సీఐ వీరన్న, ఫారెస్ట్ సిబ్బంది మంగళవారం చిరుతల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులకు సూచించారు.
Similar News
News January 21, 2026
రైతుల పాలిట కనక వర్షంగా మారిన దానిమ్మ పంట

అనంతపురం జిల్లాలో పండిస్తున్న దానిమ్మ పంట రైతుల పాలిట కనక వర్షం కురిపిస్తోంది. కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. నేడు నాణ్యతను బట్టి టన్ను దాదాపు రూ.1.50 లక్షలకు పైగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పుట్లూరు మండలం బాలాపురంలో రైతు సుదర్శన్ రెడ్డికి చెందిన తోటలో ఒక్కో దానిమ్మ కాయ 0.830 గ్రాముల బరువు దిగుబడి రావడం విశేషం.
News January 20, 2026
ఇన్ఛార్జి కలెక్టర్కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
News January 20, 2026
జేఎన్టీయూ-ఏ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.


