News March 18, 2024
గుంటూరు: నలుగురు మహిళలకు MLA టికెట్లు

వైసీపీ ప్రకటించిన ఉమ్మడి గుంటూరు జిల్లా MLA అభ్యర్థుల జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. గుంటూరు వెస్ట్- విడదల రజిని.. గుంటూరు ఈస్ట్- నూరి ఫాతిమా.. తాడికొండ- మేకతోటి సుచరిత.. మంగళగిరి- మురుగుడు లావణ్యలకు టికెట్లు కేటాయించారు. రజిని చిలకలూరి పేట నుంచి గుంటూరుకు, సుచరిత ప్రత్తిపాడు నుంచి తాడికొండకు మార్చారు. లావణ్య, నూరిఫాతిమా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
Similar News
News March 21, 2026
గుంటూరు: CRDA కమిషనర్‌గా విజయరామరాజు

CRDA కమిషనర్‌గా విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇప్పటివరకు కమిషనర్‌గా పనిచేసిన కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. కాగా CRDA కమిషనర్‌గా విజయరామరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో CRDA కమిషనర్లుగా చెరుకూరి శ్రీధర్, వివేక్ యాదవ్, కాటమనేని భాస్కరరావు, కన్నబాబు (ప్రస్తుతం) పనిచేశారు.
News March 21, 2026
తెనాలి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి

పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి(48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేశారు.
News March 21, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: మంత్రి నాదెండ్ల

రాష్ట్రంలో గ్యాస్ కొరత అపోహలపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 2.96 లక్షల బుకింగ్స్ రాగా 2.78 లక్షల డెలివరీలు పూర్తి చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా రూమర్స్ వల్లే అధిక బుకింగ్స్ జరుగుతున్నాయని, 26న విశాఖకు LPG నౌక చేరుకుంటుందని సరఫరా మరింత మెరుగవుతుందన్నారు. గ్యాస్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


