News January 28, 2025
వనపర్తి: CPM చరిత్రలో తొలిసారి దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవి..!

ఎర్రజెండా చరిత్రలో మొదటిసారిగా దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కిందని సీపీఎం అమరచింత మండల కార్యదర్శి జీఎస్ గోపి అన్నారు. అమరచింతకు చెందిన జాన్ వెస్లీ ఎంపిక చరిత్రలోనే మొదటిసారిగా ఓ దళితునికి రాష్ట్ర కార్యదర్శిగా అత్యున్నత పదవి కట్టబెట్టడం ఆ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా అత్యున్నత పదవి దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా జాన్ వెస్లీ చరిత్ర సృష్టించాలని గోపి అన్నారు.
Similar News
News July 7, 2025
జగిత్యాల జిల్లాలో 66 మంది ఎంపిక

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
News July 7, 2025
నల్గొండ జిల్లాలో 5వేలకు పైగానే రేషన్ కార్డులు కట్!

జిల్లాలో రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరుసగా ఆరు నెలలపాటు బియ్యం తీసుకొని కార్డులు రద్దు కానున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం 4,78,216 రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News July 7, 2025
ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసరని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.