News January 28, 2025

HYD నుంచి కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News November 6, 2025

భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న నాలుగో T20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, గిల్, సూర్య (C), తిలక్, అక్షర్, సుందర్, జితేశ్ శర్మ, దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షియస్, బార్ట్‌లెట్, ఇల్లిస్, జంపా.

News November 6, 2025

DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

image

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.

News November 6, 2025

BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

image

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్‌లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్‌ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.