News January 28, 2025
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మాఘ మాసోత్సవాలు ఎప్పుడంటే

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి మాఘ మాసోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 27 వరకు జరుగుతాయన్నారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం రోజున, దశమి, ఏకాదశివంటి విశేష దినాలలో ఇంద్రకీలాద్రిపై సూర్యోపాసన సేవ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆలయ అర్చకులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 14, 2025
అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది: హరీష్ రావు

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో దుయ్యబట్టారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని దళితుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కూడా కాంగ్రెస్ అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని ధ్వజమెత్తారు.
News March 14, 2025
వికారాబాద్: ‘పండుగ పేరుతో హద్దులు దాటొద్దు’

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు చల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తారు. అయితే కొందరు ఆకతాయిలు పండగ పేరుతో హద్దు మీరి ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి రంగులు పూయడం చేస్తారు. ఎదుటివారి ఇష్టంతో మాత్రమే రంగులు చల్లడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో దూరంగా ఉంచుతూ హుందాగా వ్యవహరించాలని, పండగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు తెలిపారు.
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!