News January 29, 2025
వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్

ఇంగ్లండ్‌పై 5 వికెట్లతో విరుచుకుపడిన వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించారు. T20ల్లో 2 సార్లు 5 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచారు. కుల్దీప్ యాదవ్ 40, భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచుల్లో ఈ రికార్డ్ అందుకోగా, వరుణ్ కేవలం 16 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించారు. అలాగే గత 10 T20ల్లో చక్రవర్తి 27 వికెట్లు తీశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది.
Similar News
News February 12, 2026
85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించింది. ఆయన కుడి కన్ను 85% విజన్ కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఇమ్రాన్ 2023 AUG నుంచి జైలులోనే ఉన్నారు.
News February 12, 2026
రేపే మున్సిపల్ రిజల్ట్స్.. Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా..

7 కార్పొరేషన్లు.. 116 మున్సిపాలిటీలు.. సుమారు 13వేల మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. మీరెక్కడున్నా సమాచారం మీ ముందు ఉంచేందుకు Way2News సిద్ధంగా ఉంది. ప్రతి వార్డు, డివిజన్ ఫలితాలను ఎప్పటికప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా, అతివేగంగా మన యాప్‌లో తెలుసుకోండి.
News February 12, 2026
రష్యాలో వాట్సాప్‌పై నిషేధం.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు!

వాట్సాప్‌ను బ్యాన్ చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. తమ చట్టాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. 100 మిలియన్ల యూజర్లను స్వదేశీ మెసెంజర్ యాప్ ‘MAX’కు మారాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే మ్యాక్స్ సర్వైలెన్స్(నిఘా) యాప్ అని ఆరోపణలు రాగా వాటిని అధికారులు ఖండించారు. ‘టెలిగ్రామ్’పైనా దశలవారీగా ఆంక్షలు విధించే యోచనలో రష్యా ఉన్నట్లు సమాచారం.


