News January 29, 2025
విశాఖ కేంద్ర కారాగారంలో అందుబాటులోకి ఆన్లైన్ ములాఖత్

విశాఖ కేంద్ర కారాగారంలో ఆన్‌లైన్‌లో ముందుగా ములాఖత్ రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ మహేశ్ బాబు తెలిపారు. https://eprisons.nic.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని ముందుగా ములాఖత్ డేట్ తీసుకోవచ్చని తెలిపారు. ఒక్కో ములాఖాత్‌కు ముగ్గురు విజిటర్స్ సంబంధిత ఖైదీని కలిసి మాట్లాడుకునే సదుపాయం ఉందన్నారు. రిమాండ్ నిందితులకు వారానికి రెండు ములాఖత్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News December 31, 2025
పార్లమెంట్ అటెండెన్స్.. విశాఖ ఎంపీకి 96%

విశాఖ MP శ్రీభరత్ ఈ ఏడాది పార్లమెంట్ అటెండెన్స్‌లో 96 శాతం సాధించారు. ఇండియన్ పోర్ట్స్ బిల్-225, దేశంలో అంధత్వ సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార భద్రతా నిబంధనల బలోపేతం, విశాఖ ఓడరేవులో బొగ్గు&ఇనుప ఖనిజ రవాణా వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం వంటి 15 డిబేట్స్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా మొత్తం 113 ప్రశ్నలను సంధించారు.
News December 31, 2025
విశాఖలో మూడు స్టాండింగ్ కమిటీల పర్యటన

విశాఖలో రైల్వే, వాణిజ్య, రక్షణ శాఖలకు చెందిన 3 పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు జనవరిలో పర్యటించనున్నాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కమిటీల పర్యటనకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News December 31, 2025
విశాఖ: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ వన్‌టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.


