News January 29, 2025
దేవుని కడప: శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. రేపు ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలకనున్నారు.
Similar News
News September 12, 2025
కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
News September 12, 2025
భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.
News September 12, 2025
కలసపాడు: 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

కలసపాడు గ్రామంలోని టైలర్స్ కాలనీలో ఇమ్రాన్ (3)పై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు బాలుడిపై దాడి చేసి లాక్కొని వెళ్తుండగా తల్లిదండ్రులు చూసి కాపాడుకున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు లేకుండా తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.