News January 29, 2025
రథసప్తమి ఏర్పాట్లపై TTD అదనపు ఈవో సమీక్ష

తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. టీటీడీ వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో పాల్గొన్నారు.
Similar News
News November 7, 2025
WGL: Way2News ఎఫెక్ట్.. విచారణకు MGM సూపరింటెండెంట్ ఆదేశం

రోగుల దగ్గర <<18223340>>ప్రార్థనలు చేస్తున్నారంటూ<<>> Way2Newsలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై MGM సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి వెంటనే స్పందించారు. ఈ మేరకు విచారణకు ఆదేశించారు. రాత్రిళ్లు ఇతరులు ఎవరూ పేషంట్ల వద్దకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News November 7, 2025
HYD: ఎమ్మెల్సీ ఫోన్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు

MLC శంభీపూర్ రాజు ఫోన్‌ను దుండగులు హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. వ్యక్తిగత, అధికారిక సమాచారం భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, దుండిగల్ పోలీస్ స్టేషన్‌తో పాటు గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్‌పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
News November 7, 2025
దుగ్గిరాలలో యువకుడి దారుణ హత్య

దుగ్గిరాలలోని వంతెన డౌన్‌లో రజకపాలెంకు చెందిన వీరయ్య (37) దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


