News January 29, 2025
కామారెడ్డి: అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం

అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని కామారెడ్డి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి ప్రమీల తెలిపారు. జిల్లాలోని వికలాంగులు 18 నుంచి 50 సంవత్సరాల వయసు లోపు వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం 100% సబ్సిడీ బ్యాంక్ లింక్ లేకుండా అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హత గల వారు కామారెడ్డి వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News November 11, 2025
MBNR: ‘అంగన్‌వాడీ పనితీరు మెరుగుపడాలి’

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్‌లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలని అన్నారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News November 11, 2025
‘తుఫాను బాధితులకు తక్షణమే పరిహారం అందించాలి’

తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలు, రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందించారు. తుఫాను వలన రైతులు ఆర్థికంగా నష్టపోయారని వారికి మేలు చేయాలని కోరారు.
News November 11, 2025
ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్‌లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్‌తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?


