News January 29, 2025
సంగారెడ్డి: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా జయరాజ్

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సంగారెడ్డికి చెందిన జయరాజ్‌ను రాష్ట్ర మహాసభల్లో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, రైతు సంఘాల్లో కూడా బాధ్యతలు చేపట్టారు. జయరాజ్ మాట్లాడుతూ.. తనకు మొదటిసారిగా రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి బారినపడిన జీవాల్లో తొలుత లక్షణాలు ఎక్కువగా బయటకు కనిపించవు. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు విపరీతమైన జ్వరం వస్తుంది. మేత మేయకుండా గొర్రెలు నీరసపడతాయి. సరిగా నడవలేవు. నోటి నుంచి చొంగ కారుస్తూ, పళ్లు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. కొన్నిసార్లు చిటుక వ్యాధికి గురైన గొర్రె పిల్లలు చెంగున గాలిలోకి ఎగిరి, హఠాత్తుగా మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి.
News September 14, 2025
చిన్న చింతకుంట: 24న బ్రహ్మోత్సవాల పనులకు టెండర్లు

కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను ఈ నెల 24న సీల్డ్ కవరు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్, కలర్స్ వేయడం, చలువ పందిళ్లు, ప్రింటింగ్ మెటీరియల్, టెంటు, పూజా సామగ్రి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల వారు టెండర్లు వేయాలని కోరారు.
News September 14, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శనివారం 82,149 మంది స్వామి వారిని దర్శించుకోగా 36,578 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని ప్రకటించింది.